![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -293 లో... కళ్యాణ్ ని అప్పు ప్రేమిస్తున్న విషయం ఎలాగైనా చెప్పాలని అప్పు ఫ్రెండ్ బంతి అనుకుంటాడు. కళ్యాణ్ గదిలోకి వెళ్లి.. అక్కడ ఒక పేపర్ పై అప్పు ప్రేమిస్తున్న విషయం రాస్తాడు. మరొకవైపు కళ్యాణ్, అప్పు ఇద్దరు మాట్లాడుకుంటూ గదివైపుగా వస్తుంటారు. ఆ తర్వాత బంతి కంగారుగా కనకం దగ్గరకి వెళ్లి పేపర్ పై రాసిన దాని గురించి చెప్తాడు.
బంతి అలా చెప్పడం కావ్య, పద్మావతి ఇద్దరు వింటారు. ఏంటి బంతి చెప్పేది నిజమేనా అని కనకాన్ని కావ్య అడుగుతుంది. నిజమేనని కనకం చెప్పగానే కావ్య బాధపడుతుంది. అప్పు ఇష్టపడ్డ వాడితో పెళ్లి చేయలేకపోతున్నానని అనుకుంటుంది. ఈ పెళ్లి ఆగకూడదని వెళ్లి బంతి రాసిన పేపర్ కళ్యాణ్ చూడకముందే తీసుకొవాలని కావ్య, పద్మావతి కనకం అనుకొని కళ్యాణ్ గదిలోకి వెళ్తారు. అక్కడ కళ్యాణ్ ని పెళ్లి కొడుకులాగా అప్పు రెడీ చేస్తుంటుంది. వాళ్ళని మాటల్లో పెట్టి కావ్య అ పేపర్ తీసుకుంటుంది. అ తర్వాత కళ్యాణ్ వెళ్లి పోయాక కావ్య అప్పుని హగ్ చేసుకొని ఎంత బాధ అనుభవిస్తున్నావని బాధపడుతుంది. అప్పు, కావ్య ఇద్దరు మాట్లాడుకునేవన్ని కూడా రుద్రాణి వింటుంది. ఇది అందరి ముందు చెప్తే ఎవరు నమ్మరు. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉండగా.. కావ్య పడేసిన పేపర్ రుద్రాణి తీసుకొని ధాన్యలక్ష్మికి చూపిస్తుంది. మరొకవైపు అనామిక తన పేరెంట్స్ తో వస్తుంటే.. తనకి డబ్బులు ఇవ్వనిదే మిమ్మల్ని ఇక్కడ నుండి కదలనివ్వనని సేట్ అనామిక పేరెంట్స్ తో చెప్తాడు. అదంత కావ్య చూసి రాజ్ కి చెప్పి వాళ్ళ దగ్గరకి తీసుకొని వస్తుంది. అప్పుడు సేట్ కి ఇవ్వాలిసిన రెండు కోట్లు నేను ఇస్తానని రాజ్ చెప్తాడు. అప్పుడు అనామిక పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అనామికని తీసుకొని కావ్య పెళ్లిమండపం దగ్గరకి వెళ్తుంది. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. ఇక పెళ్లి అయ్యాక కళ్యాణ్ ని మనం ఇల్లరికం తెచ్చుకోవాలని అనామిక పేరెంట్స్ అనుకుంటారు.
మరొకవైపు ధాన్యలక్ష్మిని రుద్రాణి రెచ్చగోడుతుంది. కనకం తన కూతుళ్లు కలిసి ఈ పెళ్లి ఆపాలని అనుకుంటున్నారంటు బంతి రాసిన పేపర్ చూపిస్తుంది. దాంతో ధాన్యలక్ష్మి కోపంగా అప్పుని, కనకాన్ని తిడుతుంది. నా కొడుకుని ప్రేమిస్తున్నానని ఒక నాటకం అడుతున్నారా అని ధాన్యలక్ష్మి అనగానే.. అది నాటకం కాదు నిజంగానే ప్రేమించాను కానీ ఆ విషయం ఎవరికి చెప్పలేదు. ఆ బంతి గాని వల్లే ఇదంతా అని అప్పు అంటుంది. అ తర్వాత అప్పు తప్పు ఏమి లేదు.. అంతా నాదే ఆ ఫీలింగ్ వచ్చేలా బీహావ్ చేసానని కళ్యాణ్ అంటాడు. కాసేపటికి అక్కడ నుండి అప్పు, కనకం కృష్ణమూర్తి కలిసి వెళ్లిపోతారు. ఆ తర్వాత అనామిక, కళ్యాణ్ ల పెళ్లి జరుగుతుంది. వాళ్ళ పెళ్లి కోసం వచ్చిన విక్కీ, పద్మావతి ఫ్యామిలీ వెళ్లిపోతుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |